తిరుమల శ్రీవారి సర్వదర్శన టోకెన్ల కోసం భక్తులు భారీగా ఎగబడటంతో తోపులాట చోటుచేసుకుంది. గత రెండు రోజులుగా టోకెన్ల పంపిణీ నిలిపివేయడంతో భక్తులు తిరుపతిలో వేచి ఉన్నారు. ఈరోజు మళ్లీ సర్వదర్శనం టోకెన్ల కౌంటర్లు తెరవడంతో భక్తులు భారీగా ఎగబడ్డారు. చిన్నపిల్లలతో క్యూలైన్లలో అవస్థలు పడ్డారు.
రెండు రోజుల విరామం అనంతరం తిరుపతిలోని గోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద టోకెన్లు పంపిణీ చేశారు. గోవిందరాజస్వామి సత్రం వద్దకు వేచి ఉన్న భక్తులతో పాటు నేడు వచ్చిన భక్తులు భారీగా తరలి రావడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో ముగ్గురు భక్తులు గాయపడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. తితిదే విజిలెన్స్, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా భక్తులను నిలువరించలేకపోయారు. గాయపడిన వారిని రుయా ఆస్పత్రికి తరలించారు.
బ్లాక్లో టికెట్లు అధిక ధరకు అమ్ముకుంటున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. టోకెన్ల పంపిణీకి సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై రాష్ట్రంలోని సుదూర ప్రాంతాలు, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
0 comments:
Post a Comment
Your Comment will publish After Admin moderation