విమానం వేంకటేశ్వరుడు ~ OM NAMO VENKATESAYA
!!! Lord Venkateswara staying in Tirumala Vaikuntam !!! Govinda Narayana Srinivasa Parandhama Pahimam Pahimam!!!.
!!! Chant Govindaa! Govindaa!! Govinda!!! Edukondalavadaa Venkataramanaa Govindaa Govinda!!!

Monday, October 17, 2011

విమానం వేంకటేశ్వరుడు

మనం తిరుమల లో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ శ్రీవేంకటేశ్వరుని దర్సించి, పిదప , విమానం లో వున్న వేంకటేశ్వరునికి దండం పెట్టుకుంటాం. ఇది చాలా మంది భక్తులు చేసేదే. అయితే ఇలా యెందుకు పెట్టూకుంటాము అంటే, చాలా మంది వద్ద సమాధానం వుండదు. ప్రతీ గుడి గోపురం మీద ఆ ఆలయం యొక్క మూల విరాట్ స్వరూపం చెక్కబడి వుంటుంది. అలా అని మరి మనం అన్ని ఆలయాలలోనూ, విమానం(గోపురం) లో వున్న వేల్పును కొలవటంలేదు కదా. కేవలం తిరుమల లోనే ఈ ఆచారం వుంది. ఇది యెందుకో తెలుసుకుందాం.

శ్రీకృష్ణదేవరాయలు నాలుగవ సంవత్సరం లోనే రాజ్యాభిషిక్తులు అయ్యారు. ఆయన రాజుగా వున్నప్పుడు, ఆ రాజ్యపు రాజ గురువు వ్యాస తీర్థుల వారు అనుకుంటా) అన్నిటికీ పెద్దగా వ్యవహరించే వారు. తిరుమల ఆలయం వైఖానస ఆగమం ప్రకారం నడపబడే ఆలయం. ఆ కాలంలో ఒక భయంకరమైన వ్యాధి ప్రబలి, తిరుమల లోని వైఖానసులు అందరూ కూడా మృత్యువాత పడ్డారు. అప్పుడు స్వామి వారు, వ్యాస తీర్థుల వారి కలలో కనిపించి, "ఆలయం లో అర్చకత్వం చేసే అర్హత వున్న వారు యెవరూ లేరూ(అందరూ గతించారు), ఒక మగ శిశువు మాత్రం ఒక తల్లి గర్భం లో వున్నాడు. వాడు పుట్టి, పన్నెండు సంవత్సరాలు వేదం నేర్చుకున్నాక, మల్లి ఆలయం లో పూజదికాలు మొదలుపెట్టండి. అప్పటిదాకా నేను ఆలయ విమానం మీదనే వాసం చేస్తాను" అని శెలవిచ్చారట . ఆ విధంగా, విమానం లో వున్న మూర్తి లోకి స్వామి వారు ప్రవేసించారు. తిరుమల ఆలయం 12 సంవత్సరాలు మూసివేయబడింది. ఆ 12 సంవత్సరాలు కూడా, పూజాదికాలు విమానం లో వున్న స్వామి కే చేయబడినాయి. అందువల్ల,విమానం లొ వున్న స్వామి వారికి ఆ విశిష్తత యేర్పడింది.

Related Posts Plugin for WordPress, Blogger...